ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశితంగా పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఎంత మంది నిర్దేశిత సమయానికి వచ్చారని హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు14మందితోపాటు మరో నలుగురు వైద్య సిబ్బంది గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వారి హాజరు వివరాలను తెలిపే
బయోమెట్రిక్ యంత్రంలో వారి వివరాలను ప్రింటు తీసి ఇవ్వాల్సిందిగా ఇంచార్జి సూపరింటెండెంట్ కు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విధులను సరిగా నిర్వహించని 14మందికి షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఫార్మసి స్టోర్ ని తనఖీ చేసి స్టాక్ వివరాలు, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం పట్ల ఫార్మసిస్టును వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కంటి వైద్య చికిత్సకు సంబంధించిన ల్యాబ్ ను పరిశీలించి, కంటి సమస్యలతో వచ్చే రోగులకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా ఆపరేషన్ థియేటర్ ను జులై 1 నుంచి పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 50 పడకల వార్డులో పేషెంట్లను (పురుషులను) అందులోకి తరలించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్ నమోదు వివరాలు తెలిపే రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ క్రాంతి, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు-కంటి సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలి-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్-ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు..ఫార్మసిస్ట్ పై సస్పెన్షన్ వేటు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES