Tuesday, December 24, 2024

గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన వల్లూరు క్రాంతిపై విచారణ చేపట్టాలి-కాంగ్రెస్ నాయకులు డిమాండ్ ఓరుగల్లు నేషనల్9టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్9టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన వల్లూరు క్రాంతి గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా పనిచేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఉండి వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారని తెలిపారు. రైతు భూముల రికార్డులకి సంబంధించి జిల్లాలోని వివిధ మండలాల్లో పేద రైతుల భూములు రికార్డులను సరైన పద్ధతిలో ఉన్నా వాటికి, లేని వాటిని రికార్డు సరి చేయడానికి తన తండ్రి డాక్టర్ వెంకట రంగారెడ్డి కర్నూల్ లో గ్యాస్ట్రో హాస్పిటల్ నడుపుతుంటారని, వారి ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తూ రికార్డులను అక్రమంగా ఎక్కించి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్థికంగా లేని రైతులు, డబ్బులు ఇవ్వలేని వారి సమస్యలు, రికార్డులు సరి చేయకుండా ఇప్పటిదాకా పెండింగ్లో పెట్టడం జరిగిందని, ఆమె చేసిన అవినీతిపై సరైన పద్ధతిలో విచారణ చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లాలో చేసిన అవినీతికి సంబంధించిన వివరాలు ఇవి.

1) రాజోలి మండలం, పెద్ద తాండ్రపాడు గ్రామంలో సర్వే నెంబర్ 156/. 39 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఈ భూమిని తొలగించడానికి ఫిబ్రవరి 2023లో ఆర్థిక లావాదేవీలు వారి తండ్రి ద్వారా తీసుకోవడం జరిగింది.
2) అలంపూర్ మండలం, కోనేరు గ్రామం నందు సర్వేనెంబర్10లో వివాదంలో ఉన్న 10 ఎకరా పట్టా భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది.
3 ) గట్టు మండలం, ఇందువాసి గ్రామంలో సర్వేనెంబర్ 45, 46లో భూదాన్ బోర్డుకి సంబంధించిన16 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది.
4) గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కుచినెర్ల గ్రామంలో రికార్డు లేనటువంటి భూములను రికార్డులో ఉన్నట్టుగా అప్పటి ఆర్డిఓ రాములు, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇద్దరు కలిసి రికార్డులు ఉన్నట్టు చూయించి దాదాపు 400 ఎకరాలకు అక్రమంగా రైతుల పేరుతో డబ్బును దోచుకోవడం జరిగింది.
5) అల్లంపూర్ క్రాస్ రోడ్ పుల్లూరు విలేజ్ నందు సర్వేనెంబర్ 268 వివాదంలో ఉన్నటువంటి భూమిని మొదట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి కాకుండా రెండో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి డిజిటల్ సిగ్నేచర్ చేసి వారికి అక్రమంగా రికార్డును ఎక్కించడం జరిగింది.
6) ఇటిక్యాల మండలం, సాసనూలు గ్రామంలో సర్వేనెంబర్ 5 /6 /నందు 0/20 గుంటల వక్ఫ్ బోర్డ్ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా రికార్డు ఎక్కించడం జరిగింది.
7) అల్లంపూర్ ఎక్స్ రోడ్ ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సర్వేనెంబర్ 256 నందు 6 ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేయడం జరిగింది.
8) అల్లంపూర్ ఎక్స్ రోడ్డు నందు భూదాన్ బోర్డుకి సంబంధించిన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేసి కోట్ల రూపాయల ఆర్థిక లాభం పొందారు.
9) అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో అక్రమంగా ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని 53 కమర్షియల్ సెటర్లు కట్టినటువంటి వ్యక్తులకు కోర్టు నుంచి డిష్ మెటల్ ఆర్డర్ వచ్చి కూడా వాటిని రెసిడెన్షియల్ గా మార్చుకోవడానికి అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్బలంతో మున్సిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా వాటిని రెసిడెన్షియల్ గా మార్చడానికి ఆర్థిక లావ్యాదేవిలు జరిగినట్టు తెలిసింది.
10) అయిజ మండలం, బింగిదొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 62 నందు రోడ్డుకు పోయినటువంటి భూమిని కూడా రికార్డుల్లో కట్ చేయకుండా మిగులు భూమిని రికార్డు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది
ఈ లావాదేవీలన్ని వారి తండ్రి డాక్టర్ వెంకట్రామిరెడ్డి ద్వారా జరిగినట్టు ఆరోపణలు వస్తున్నందున వీరిపై గతంలో చేసినటువంటి అవినీతిని సరైన పద్ధతిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని కోరుతూ శనివారం వారు సీఎస్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్
తనగల సీతారామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అయిజ మున్సిపల్ కౌన్సిలర్ మాస్టర్ షేక్ షావలి ఆచారి, గద్వాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ గంజిపేట శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌస్, గట్టు మండల పార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular