జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : కక్షిదారులు ఏళ్ల తరబడి తమ కేసులతో కోర్టుల చుట్టు తిరగకుండా రాజీమార్గంలో సివిల్ కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. కుష అన్నారు. బుధవారం గద్వాలలోని న్యాయస్థానంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవితో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న జిల్లాలోని గద్వాల, అలంపూర్ న్యాయస్థానాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు రెండవ జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భార్యభర్తల గొడవలు, భూ తగాదాలు, గృహహింస, డ్రంక్ అండ్ డ్రైవ్, చెక్ బౌన్స్, ఇన్సూరెన్స్, తదితర రాజీ పడ దగ్గ కేసులన్నింటిని లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో ఇలాంటివి1504 కేసులను గుర్తించి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 2000 పైగా కేసులు వచ్చినా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గత లోక్ అదాలత్ లో జిల్లాలో 3060 కేసులు పరిష్కరించినట్లు వివరించారు. కక్షిదారులు సమయం, కోర్టు ఫీజులు ఆదా చేసుకోవడానికి లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందన్నారు. మర్యాదకరంగా, సామరస్య పూర్వకంగా కేసులను రాజీ చేసుకునేందుకు అవకాశం ఉన్నందున కక్షిదారులందరు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలి-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. కుష ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES