Monday, December 23, 2024

స్వేచ్ఛా ప్రజా తెలంగాణకోరి తెచ్చుకున్న కోటి ఆశల మన తెలంగాణ.-తాబేటి కుమారస్వామి-ఓరుగల్లు9నేషనల్ టివి

కవితా శీర్షిక:- .కవులు కళాకారులు కదం తొక్కగా సాధించుకున్న కలల తెలంగాణ.
ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల ఆత్మార్పణతో ఆవిర్భవించినదీ ఈ నేల.
కొలువుల కొట్లాట కోసం అసువులు బాసిన యువతి యువకుల త్యాగాలతో తడిసి వెలసినదీ నా తల్లి తెలంగాణ ఈ వేళ. బీళ్లు వారిన దుక్కిళ్ళు దండుకట్టి దున్నిన ఉద్యమ రైతుల రణ నినాదంతో ఉద్భవించిన ఉషోదయం ఈ నేల.
విద్యార్థులు  వీధులకెక్కి వీరోచిత పోరాటంతో,తపనలతో తనువులు తరాజువ్వలై మెరిసి అవతరించినది ఈ వీర తెలంగాణ.
నాటి నుండి నేటి వరకు గడీల పాలకులను గద్దెదించే ఘన చరిత్ర గలిగిన నిత్యచైతన్య ప్రజా వేదిక నా తెలంగాణ.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలకు మేలు చేసే పరిపాలన కోసం నాయకులను నమ్మి భరించ గల సహనశీలి ఈ నేల తల్లి.

నమ్మితే ప్రాణమిస్తుంది – నమ్మక ద్రోహనికి పాల్పడితే నరాలు మెలిపెట్టి నయవంచకుల నడ్డి విరుస్తుంది నా తెలంగాణ ప్రజా పౌరుషం.
స్వేచ్ఛ, సమానత్వం కోసం పురుడుపోసుకున్న ఈ పుడమి తెలంగాణలో – అవే కరువైనపుడు కర్రుకాల్చి వాతపెట్టడం కూడా తెలిసిన జాగరుకత నా తెలంగాణ ప్రజా నైజం.
స్వతంత్ర తెలంగాణలో ప్రజాకంటక పాలన సాగిస్తే
పదేండ్లైన, ఐదేళ్లయిన నాయకులు ఎంతటి వారైనా అదను చూసి గుణపాఠం చెపుతుంది ఈ నేల గుణం తస్మాత్ జాగ్రత్త!
ఇకనైనా! ఆర్భాటాలు తగ్గించుకుని అమరుల ఆశయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రగతి పయనం సాగించాలని పరితపిస్తుంది నా తెలంగాణ.

ఈ పది వసంతాల పరువంతో నా ముక్కోటి గొంతుకల ముదిమి తెలంగాణలో ప్రజల కోసం విద్యా, వైద్య,ఉద్యోగ అవకాశాలు కలిపిస్తూ, అభివృద్ది పథంలో సాగే పరిపాలనా రీతీకై ఆశగా ఎదురుచూస్తుంది నా సబ్బండ వర్ణాల స్వేచ్ఛా ప్రజా తెలంగాణ.

            రచన…,✍️✍️
              తాబేటి కుమారస్వామి
              ప్రభుత్వ ఉపాధ్యాయుడు
              సెల్:9912638948.
( 2-జూన్ తెలంగాణ రాష్ట్ర అవిర్భవ10వ.సంవత్సరం సందర్భంగా,dt 28/5/2024)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular