ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. మే 30వ తేదీ గురువారం సన్ సిటీ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడితో పాటు ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ ఈవెంట్ మ్యానేజర్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్న ట్లు పోలీసులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో గంజాయి పట్టుబడింది. నందిగామ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వంశీ(25) అనే యువకుడిని పటాన్ చెరు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర ఉన్న 330 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. యువకుడితోపాటు స్కూటీని స్వాధీన చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం-ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి
RELATED ARTICLES