ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: ప్రస్తుతం యువత పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కాకుండా తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాము ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దపడుతున్నారు.ఇటీవల యువత చాలా వరకు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాలు చూసి అన్నీ కుదుర్చుకున్న తర్వాత వివాహాలు జరిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇష్టపడిన వారితో కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉండి తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎలాంటి త్యాగాలైనా చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రేమ ప్రేమా అంటూ ఆ యువతి వెంట పడ్డాడు. ఆ యువతి కూడా అతన్ని మనసారా ప్రేమించింది. ఏం జరిగిందో కానీ.. ఆ యువతి నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.
ఏనిమిదేళ్లుగా ప్రేమించమని వెంటపడ్డాడు.. తీరా ప్రేమించిన తర్వాత ముఖం చాటేశాడు. దీంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్ నగర్ లోని ఎన్ఎల్ బీ నగర్ కి చెందిన అఖిల (22) ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో మంచి ఉద్యోగం చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ గత ఏనిమదేళ్లుగా అఖిలను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. నువు ప్రేమించకుంటే చనిపోతా అంటూ బెదిరించాడు. కొంతకాలం అతని ప్రేమను అంగీకరించి ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరిచారు.
తనకు అఖిల అంటే ఇష్టం లేదని చెప్పాడు. అఖిల్ ని ఎంతగానో ప్రేమించిన అఖిల ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకున్న తనకు ఇలా జరిగిందేంటీ? అంటూ డిప్రేషన్ లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి.. ఇట్లో ఆత్మహత్యకు పాల్పపడింది. ఇంట్లోకి వచ్చిన అఖిల కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కంటికి రెప్పలా సాకిన తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అఖిల తండ్రి ఫిర్యాదు మేరకు అఖిల్ సాయిగౌడ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.