Tuesday, December 24, 2024

స్థలం వివాదానికి మతతత్వ రంగు అంటించవద్దు-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గట్టు మండలంలోని గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ స్థల వివాదానికి సంబంధించి ఆ స్థలం ఎవరిదనేది గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారని, అతి త్వరలో ఆ స్థలం ఎవరిదనేది గుర్తించిన అనంతరం ఈ వివాదానికి కారకులైన వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఇప్పటికే ఆ వివాదాస్పద స్థలం భూ యజమానులను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తి కసరత్తు చేస్తుందని, ఆ స్థలం యాజమాన్యానికి సంబంధించి రెవెన్యూ శాఖ నిర్ణయం రాగానే వివాదానికి కారకులైన వారిపై పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని, అప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఈ సమస్యను ఎవరు కూడా మతతత్వ రంగులోకి మార్చవద్దని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వసించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. అలాగే ఈ వివాదాన్ని మతాల మధ్య గొడవగా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే వారిపైన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాపై ఇప్పటికే పోలీస్ శాఖ నిఘా పెట్టిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular