జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాల పట్టణంలో రెండు వేర్వేరు ఘటనల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కి తరలించినట్లు గద్వాల పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నిందితులను విలేఖర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గత ఏప్రిల్ నెల 24న ఆంధ్రప్రదేశ్ లోని చీరాల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి గద్వాల పట్టణంలోని విఘ్నేశ్వర హ్యాండ్లూమ్ చీరల షాపులో ఏడు చీరలు దొంగిలించిన వ్యక్తులలో ఒక్కరు దేవర శివ అనే వ్యక్తిని, గద్వాల పట్టణానికి చెందిన మేకల వెంకటేష్ పట్టణంలోని లేడీస్ కార్నర్ షాపు కౌంటర్లో రూ. 20వేలు దొంగతనం చేసిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
గద్వాల పట్టణంలో దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్-వివరాలు వెల్లడించిన ఎస్ఐ శ్రీనివాస్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES