Monday, December 23, 2024

తెలంగాణలో వెహికల్స్​అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్​:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణలో ఇక వెహికల్స్​ అన్నీ రాష్ట్ర కోడ్​ టీఎస్​కు బదులు టీజీతోనే రిజిస్ట్రేషన్​చేసేందుకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలపై రాష్ట్ర కోడ్​ ‘టీఎస్’ గా పేర్కొంటున్నారు. అయితే, రాష్ట్రంలో ఇటీవల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వాహనాలపై టీఎస్‌కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గతంలోనే గెజిట్​ విడుదల చేసిన కేంద్రం ఉపరితల రవాణా శాఖ, గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం.. సీరియల్ నంబర్ 29 ఏ కింద టీఎస్ స్థానంలో టీజీగా సవరించింది. కాగా, మూడు నెలల నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లన్నీ టీజీ పేరుతోనే జరుగుతున్నట్టు తెలంగాణ ఆర్టీఏ జాయింట్​కమిషనర్​ రమేశ్​ కుమార్​ గురువారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని, దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular