Saturday, June 28, 2025

మరో 12 గంటలు వైన్ షాపులు బంద్ :ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్ కానున్నాయి ఈ విషయాన్ని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. పోలింగ్ జరిగే మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం మరో 12 గంటలు లిక్కర్ షాపులు, బార్లు, హోటల్స్, క్లబ్స్,అన్ని రకాల లిక్కర్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మే 14 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ అవుతాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular