ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఇప్పటికే తెలంగాణకు పట్టిన పీడను వదిలించుకున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడ (కేటీఆర్ ను) కూడా వదిలిస్తానని సీఎం రేవంత్రెడ్డిఅన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి మిడ్ మానేరు ముంపు బాధితులను కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు మద్దతుగా సిరిసిల్లలో నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. ‘బతుకమ్మ చీరలకు సంబంధించి కేటీఆర్ రూ.275 కోట్ల బకాయిలు పెట్టిండు.
వాళ్ల తండ్రి కేసీఆర్ రూ.40 వేల కోట్లు రాష్ట్రానికి ఉద్దెర పెట్టిపోయిండు. ఈ బకాయిలు కూడా మేమే కట్టాల్సి వస్తున్నది’ అని అన్నారు. నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ విడుదల చేసే బాధ్యత తనదేనని సీఎం చెప్పారు. ఇప్పటికే మొదటివిడత రూ.50 కోట్లు రిలీజ్ చేశామని తెలిపారు. ‘ కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ టిల్లు అన్ని మాట్లాడుతడు. కానీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుంటే మాత్రం నోరుమెదపడు’ అని కేటీఆర్‌పై సెటైర్వేశారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగాల సమితి అని ఎద్దేవా చేశారు.‘ వినోద్ రావు ఇంట్లకేంచి ఎల్లుతలేడు. ప్రచారానికి వస్తలేడు. కరీంనగర్ బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించేందుకే ఇట్ల చేస్తుండు’ అని ఆరోపించారు.