Sunday, June 29, 2025

నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్స్, ట్యూటర్లుగా ఉద్యోగాల నియామకం కోసం తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు జిల్లా సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 7 ట్యూటర్, 22 సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి వారికి తాత్కాలిక నియామకం కింద గౌరవ వేతనం చెల్లిస్తూ మార్చి 31, 2025 వరకు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో తాత్కాలికంగా నియమించనున్నట్లు కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపికైన సీనియర్ రెసిడెంట్ కు నెలకు రూ. 92,575లు, ట్యూటర్ కు రూ. 57,700ల గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 2 అనాటమీ, 2 ఫిజియాలజి, 2 బయో కెమిస్ట్రీ,1 ట్యూటర్ పోస్టులకు, 1 అనాటమీ, 1 ఫిజియాలజి, 1 బయో-కెమిస్ట్రీ,1 ఫార్మకాలజీ,1 పాథాలజీ,1 మైక్రోబయాలజీ, 1 ఫోరెన్సిక్ మెడిసిన్,1 కమ్యూనిటీ మెడిసిన్, 2 జనరల్ మెడిసిన్, 2 జనరల్ సర్జరీ, 1 సైకియాట్రి, 1 పీడియాట్రిక్స్,1 ఆర్థోపెడిక్స్, 1 ఈ.ఎన్.టి, 1 ఆప్తమాలజి,1 ఓ.బి.జి, 1 రేడియో డయాగ్నోసిస్, 2 అనస్థీషియా, 1 డి.వి.ఎల్ సీనియర్ రెసిడెంట్స్ కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకుగాను ఈ నెల 10వ తేదీన జోగులాంబ గద్వాల ఐ.డి.ఓ.సి సమావేశం హాలులో ఉదయం వాక్‌-ఇన్- ఇంటర్వ్యూ నేరుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ అర్హత కలిగి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలని, అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుతోపాటు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను ఖచ్చితంగా తీసుకొనిరావలసి ఉంటుందన్నారు. ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుదారుడి వయస్సు తప్పనిసరిగా మార్చి 31, 2024 నాటికి 45 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని, ఇందులో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెలక్షన్ కమిటీ తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular