జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సెలక్షన్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు ఖాళీగా ఉన్న 11 డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 3 ల్యాబ్ అటెండెంట్లు, 9 ఆఫీస్ సబార్డినేట్లు, 1 థియేటర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి స్థానికులై ఉండాలని, అభ్యర్థులను అవుట్ సోర్సింగ్ పద్దతిన నియమించినున్నట్లు చెప్పారు. ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిటీ తెలిపింది. దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 16న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నుంచి మ్యానువల్ గా స్వీకరించి పూర్తి చేసిన దరఖాస్తులను ఎంప్లాయిమెంట్ కార్యాలయం రూమ్ నంబర్ ఎఫ్-30/01లో అందజేయాలని, లేదా అన్ని ధ్రువీకరణ పత్రాలతో జోగులాంబగద్వాలమెడికల్ కాలేజి జీమెయిల్ కు పంపవచ్చని పేర్కొన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు డిగ్రీతో పాటు పీజీడీసీఏ, ఇంగ్లీషులో హయ్యర్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ల్యాబ్ అటెండెంట్ కోసం బీఎస్సీ ఎంఎల్టి లేదా డీఎంఎల్టి, ఆఫీస్ సఫార్డినేట్ కోసం10వ తరగతి, థియేటర్ అసిస్టెంట్ కోసం10వ తరగతితోపాటు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్నుండి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసి ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారి పేర్లను ఈ నెల18న ప్రకటిస్తారని, ఎంపిక జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే18,19 తేదీలలో సరిచేసుకొని అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 20న ప్రకటించడం జరుగుతుందని కమిటీ తెలిపింది.
ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేయుటకు దరఖాస్తు చేసుకోండి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES