జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న ఉషా క్లినిక్ ని గురువారం జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జి. స్రవంతి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆర్ఎంపీ ఎం.తిమ్మారెడ్డి నిర్వహిస్తున్న ఈ ఉషా క్లినిక్, తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010,రూల్స్-2011 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, అంతేకాకుండా ఈ క్లినిక్ నందు తిమ్మారెడ్డి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు చికిత్స చేస్తుండడం, మహిళ గర్భం దాల్చిందా లేదా అని నిర్ధారించే కిట్స్, ప్రవేట్ హాస్పిటల్ కి రెఫర్ చేసే రెఫరల్ స్లిప్స్ ఉండడం అధికారులు గమనించి ఈ క్లినిక్ ని తాత్కాలికంగా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
ఉషా క్లీనిక్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES