Monday, December 23, 2024

దేశంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌

ఓరుగల్లు9నేషనల్ టీవీ :దేశంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ 2024 మార్చి 20వ తేదీన వెలువడనుంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉపసంహరణకు తుది గడువు. వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది.

అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకూ పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ లో 5, అస్సాంలో 5, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular