ఓరుగల్లు9నేషనల్ టీవీ :కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. తన కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన ఉదయ్ ను ఎంపీగా బరిలోకి దింపుతున్నట్లు చెప్పారు. ఒక వేళ మోదీ, అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీచేస్తానన్నారు పవన్. అపుడు ఉదయ్ తాను స్థానాలు మార్చుకుంటామని చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ రెండు స్థానాలు తమకు కీలకమన్నారు పవన్. జనసేన లేకపోతే పొత్తులు లేవన్నారు పవన్. పొత్తుల కోసం బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించానని చెప్పారు.
ఎక్కడి నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధిష్టానం నన్ను అడిగింది..ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పా. కాకినాడ ఎంపీ సీటు గెలవడం ముఖ్యం కాదు..లక్ష మెజారిటీ రావాలి కాకినాడ దద్దరిల్లాలి. 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు లోక్ సభ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని చెప్పారు పవన్. ఈ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ 144 ఎమ్మెల్యే సీట్లు,17 ఎంపీ సీట్లు, జనసేన21 అసెంబ్లీ, 2 లోక్ సభ, బీజేపీ 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.