Friday, June 27, 2025

తెలంగాణ అదనపు గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేయగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆమోదించారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సీపీ రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన వారు. కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్‌ గవర్నర్ గా ఎన్నికయ్యారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular