Saturday, December 21, 2024

హన్మకొండ, హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో మహా శివరాత్రి వేడుకలు-ఛైర్మెన్ ఏనుగుల రాకేష్ రెడ్డి-ఓరుగల్లు9నేషనల్ టివి

మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో పాల్గొనండి. ఆ పరమ శివుడి అనుగ్రాన్ని పొందండి.

ప్రతీ ఏటా నిర్వహించినట్టు గానే ఈ ఏడాది ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ, హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.

ఆ పరమ శివుడి అనుగ్రహం ఓరుగల్లు ప్రజల మీద ఉండాలన్నదే మా సంకల్పం.

🔹ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కర పత్రాని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషు అయ్యగారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.

🔹కరపత్ర ఆవిష్కరణలో  పాల్గొన్న ఇండస్ ఫౌండేషన్ ఛైర్మెన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, VHP జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ శేషు అయ్యగారు మాట్లాడుతూ

🔹సనాతన ధర్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటి చెప్పడానికి మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఓరుగల్లు కేంద్రంగా నిర్వహిస్తున్న ఇండస్ ఫౌండేషన్ కు ప్రత్యేక శుభాశీస్సులు.

🔹సనాతన ధర్మంలో హిందువులకు అంత్యంత ప్రీతీ పాత్రమైన అతి ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి అగ్రభాగాన ఉంటుందనీ, శివతత్వానికి కేంద్రమైన ఓరుగల్లు లో ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవ్వాలి.

🔹కార్యక్రమ నిర్వాహకులకు, ఇందులో నిమగ్నులై అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం తోడై ఈ దైవిక కార్యక్రమం విజయవంతం అవ్వాలి.

🔹ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మమ్మల్నే ఎన్నుకోవడం, ఉత్సవం కూడా విజయవంతం అవ్వడం శుభసూచకం.

🔹సనాతన వైదిక ధర్మం విశిష్ఠతను, పరమ శివుడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి ఇండస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం నిజంగా అభినందనీయం.

🔹ఇంతటి విశిష్టత తో, ఓరుగల్లు తత్వాన్ని ప్రపంచానికి చాటడం కోసం, మహా శివరాత్రి జాగరణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో పెద్ద యెత్తున అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వలని పిలుపునిచ్చారు.

🔹ఆ పరమ శివుడి అనుగ్రహం ఓరుగల్లు ప్రజలందరి మీద ఉంటుందని, ఈ మహా శివరాత్రి జాగరణ ఇండస్ ఫౌండేషన్ వేదిక దగ్గరే నిర్వహించుకోవడం కోసం ప్రజంతా సిద్ధం అయ్యారని అన్నారు.

ఇండస్ ఫౌండేషన్ ఛైర్మెన్, ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ

🔹ఓరుగల్లు శివతత్వానికి ఆధ్యాత్మికత కు పెట్టింది పేరని, మన ఓరుగల్లు విశిష్ఠను ప్రపంచానికి చాటి చెప్పడమే ఇండస్ ఫౌండేషన్ లక్ష్యం.

🔹అందులో భాగంగానే శివతత్వానికి నిలయమైన మన ఓరుగల్లు లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆ పరమ శివుడి అనుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు తోడై విజయవంతం అవుతుంది.

🔹ఇండస్ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం వేదిక ఎందరో మట్టిలోని మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

🔹ప్రతీ ఏటా ఓరుగల్లు ఔన్నత్యానికి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ, ఓరుగల్లు కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట వ్యక్తులకు ” కాకతీయ పురస్కారం” ఇచ్చి ప్రోత్సహిస్తూ, గౌరవించుకోవడం జరుగుతుంది.

🔹శివ పార్వతీ కళ్యాణం, బ్రహ్మ శ్రీ గంగాధర శాస్త్రి గారి, శ్రీ రాథా మనోహర్ దాస్ గారి ప్రవచనం, సప్త హారతి,పేరని శివతాండవం, తో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్ గారు, చరణ్ అర్జున్ వివిధ సినీ, జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటపాటలు, నృత్యకళా ప్రదర్శనలు ఉంటాయని, ఇటీవలే తెలుగు ప్రజలకు గొప్ప చిత్రాన్ని అందించిన హనుమాన్ చిత్ర బృందానికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఉంటుందని అన్నారు.

ప్రతీ ఏటా విజవంతం చేసినట్టే ఈ ఏడాది కూడా విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

VHP జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ

🔹మహా శివరాత్రి హిందువులకు ఎంతో ప్రతీ పాత్రమైన పవిత్రమైన పండగ కావున అలాంటి పర్వదినాన శివరాత్రి జాగరణ కోసం ఏర్పాటు చేసిన ఈ వేదిక ఒక శివ సమ్మేళనం గా విరాజిల్లుతుంది.

🔹సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే కార్యక్రమం ఎక్కడ జరిగినా వారికి అండగా VHP విశ్వహిందూ పరిషత్ ఉంటుందని అన్నారు.

🔹ప్రతీ హిందువు సమాజంలో ప్రతీ పౌరుడు కుల మతాలకు అంతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.

🔹రాజకీయాలకు అతీతంగా ఓరుగల్లు విశిష్ఠతను, శివతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏనుగుల రాకేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషి గొప్పగా ఉంది.

🔹దైవానుగ్రహం తోడై ఈ కార్యక్రమం గతం కంటే మరింత రెట్టింపు విజయవంతం చెయ్యడం లో ప్రతీ ఒక్కరూ కార్యకర్త గా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి కార్యక్రమ నిర్వహక కోఆర్డినేటర్ లు కత్తుల అభిషేక్, ఎలగందుల దీపక్, 2 వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్, వెలేరు ఎంపీటీసీ -1 భూపతి రాజు, కార్యక్రమ నిర్వాహకులు సుకాంత్, నరేందర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular