జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరికి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని, అందుకుగాను ఓ లింక్ పంపి దానిని క్లిక్ చేసిన వెంటనే నేరస్తులు వాళ్ళకు కాల్ చేసి ఓటీపీ వివరాలు అడిగి ఆనంతరం మూడు దశలలో రూ. 25490లు దోచారని తెలిపారు. మరొక కేసులో ఇన్స్టాగ్రామ్ లో తక్కువ రేట్ కు మొబైల్స్ అమ్ముతామని, తాము ఆర్మీ వాళ్ళము అంటూ యాడ్స్ ఇవ్వగా బాధితుడు వారికి కాల్ చేసి వివరాలు అడుగగా అందుకు వారు కొరియర్, తదితర చార్జెస్ కింద రూ. 8100లు వారి అకౌంట్లోకి వేసుకున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జార్ఖండ్, రాజస్ధాన్ రాష్ట్రాలకు చెందిన జహురుద్దీన్, మెహర్ అజాం, వాకిల్ అనే ముగ్గురు నేరస్తులను (ఒక కేసులో ఒకరు, ఇంకో కేసులో ఇద్దరు) డబ్బులు మార్పిడీ జరిగిన అకౌంట్స్, ఫోన్ నం ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వారిపై పిటీ వారెంట్లు అమలు చేసి మహబూబ్ నగర్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే సంఘటన జరిగిన వెంటనే స్పందించి1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఇలా చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించవచ్చని ఎస్పీ తెలిపారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES