ఓరుగల్లు9నేషనల్ టీవీ :అయోధ్య.. ఇప్పుడు భక్తుల రద్దీకి ప్రత్యక్ష నిదర్శనం. రోజూ వేలాది మంది రామ భక్తులు తరలి వస్తున్నారు. దీనికితోడు విపరీతమైన చలి. తిన్నా తిన్నకపోయినా.. కడుపులో వేడి వేడి టీ పడితే చాలు అనుకునే భక్తులకు.. హోటల్స్ షాక్ ఇస్తున్నాయి.అయోధ్య ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ హోటల్ లో ఛాయ్.. టీ 55 రూపాయలు అమ్ముతున్నారు. టోస్ట్ వైట్ అయితే 66 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
టీ 55 రూపాయలు ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.అయోధ్య రామ మందిర ప్రారంభానికి ముందు ఛాయ్ 10 నుంచి 20 రూపాయలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా 55 రూపాయలకు పెంచారు. రామ రాజ్యంలో ధరల దోపిడీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అయోధ్యలో శబరి కిచెన్ అనే హోటల్ లో టీ, టోస్ట్ లు ధరలు అమాంతంగా పెంచింది. టీ ధర రూ. 55, టోస్ట్ వైట్ ధర రూ. 66 వసూలు చేస్తున్న బిల్లును సోషల్ మీడియాలో పెట్టారు బాధితుడు. ఇది వైరల్ గా మారింది. మాతా శబరి పేరుతో ఆ రెస్టారెంట్ పెట్టి మరీ దోపీడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ రంగంలోకి దిగింది. వివరణ కోరుతూ శబరి రసోయ్ కి నోటీసులు పంపారు.