దివంగత రామ శ్రీనివాస పద్మశాలికి సంతాప సభను ఈరోజు హంటర్ రోడ్ లోని బీసీ నేత హాస్టల్ నందు డాక్టర్ చందా మల్లయ్య హనుమకొండ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగినది రామ శ్రీనివాస్ మోక్షారామం ఫౌండేషన్ అమ్మ ఒడి సృష్టికర్త ప్రతిరోజు అనాధ వృద్ధులకు కులాలకు అతీతంగా గత ఆరు సంవత్సరాల నుండి సుమారు 300 నుండి 400 మందికి అన్నదానం చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త అదేవిధంగా వరల్డ్ పద్మశాలి క్లబ్ మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అనేకమైన పద్మశాలి అన్న సత్రం లకు భారతదేశంలో ఎన్ని అన్నసత్రాలు ఉన్నాయో అన్ని అన్న సత్రాలకు కొన్ని కోట్ల రూపాయలను సహాయం చేసిన దాన కర్ణుడు రామ శ్రీనివాసు అదేవిధంగా ఎన్నో చేనేత కుటుంబాలకు పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి వారి కుటుంబాలను ఆదుకున్న ప్రాణదాత తెలంగాణ రాష్ట్రంలో పద్మ శాలిలందర్నీ ఏకతాటిపై నిలబెట్టి ఒకే సంఘంగా సుమారు 50 వేల మంది సభ్యత్వంతో ఏర్పాటు చేసి ప్రజా స్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహించాలని తలపెట్టిన ఏకైక రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా కోరుట్ల పద్మశాలి మహాసభకు లక్ష మంది పైచిలుకు తో సభ నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి వీరు గుండెపోటుతో అకాల మరణము చెందడం వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశారు నేత హాస్టల్ నందు సంతాప సభను జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది
దీనిలో అందరూ పద్మశాలి ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు, కార్యక్రమంలో దుస్సా జనార్దన్ మంతెన రమేష్ పాస్ కంటి రాజేంద్రప్రసాద్ గంజి గణేష్ దాసరి ప్రేమ్ సాగర్ గుడిమల్ల కృష్ణారావు వలస సుదీర్ గైనేని సత్యనారాయణ బాల రామయ్య దర్గా కాజీపేటకు చెందిన వలపదాస రాజన్న రాజమల్లు వరంగల్ జిల్లా కన్వీనర్ బాల్నే శరత్ బాబు జనగాం జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు మైబాద్ జిల్లా కోశాధికారి పెండెం రమేష్ వివిధ మండలాల మరియు డివిజన్ల కార్యవర్గము పద్మశాలి ప్రముఖులందరూ పాల్గొని శ్రద్ధాంజలి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు