Tuesday, July 1, 2025

వాలీబాల్ విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచు సుజాత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం, సంకాపురం గ్రామంలో సర్పంచు సుజాత రాముడు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు. మంగళవారం పోటీల ముగింపులో భాగంగా గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచు సుజాత రాముడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, పెద్దలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారు గెలుపుకు పొంగిపోకుండా, ఓడిన వారు కృంగిపోకుండా స్నేహాభావంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు ఈశ్వర్, వార్డు సభ్యులు నాగమ్మ, గ్రామ పెద్దలు, గ్రామ యూత్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular