Monday, June 30, 2025

జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరాపై గట్టి నిఘా ఉంచాలి-పోలీసులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరాపై పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని, అట్టి కేసులలో పకడ్బందీగా విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేయాలని, అలాగే పోలీస్ స్టేషన్లలో కొనసాగుతున్న ఫంక్షనల్ వర్టికల్ పనితీరును మెరుగు పరుచుకోవాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై, నార్కోటిక్ డ్రగ్ సైకోటాపిక్ సబ్స్టాండ్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసుల నమోదు, విచారణ, పంచనామా చేపట్టే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి మాదకద్రవ్యాలకు సంబంధించి సమాచారం వచ్చినప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలు, రైడింగ్, విచారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేసు నమోదు, శాంపిల్ సేకరణ, పంచనామా నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, ప్రాపర్టీ డిస్పోసల్, చార్జిషీట్ సమయంలో పాటించాల్సిన నియమాలను పోలీస్ అధికారులకు వివారించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పకడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. రోడ్ల మీద మాదక ద్రవ్యాలు పట్టుబడితే అనుసరించే దానిపై పోలీస్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆయా కేసులలో నిందితులకు తప్పకుండా శిక్ష పడేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా కేసులలో పట్టుబడిన వస్తువుల పంపిణీని జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి నిర్ణయం మేరకు చేయబడుతుందని తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లలో అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్ అయిన రిసెప్షన్ మేనేజ్మెంట్, బ్లూకోల్ట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్స్, కోర్టు డ్యూటీ, ఇన్వెస్టిగేషన్, ఎస్హెచ్ఓ వర్టికల్ పనితీరును మెరుగు పరుచుకోవాలని, అందుకు ఆయా విభాగాల సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ వారంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి నో నంబర్, ఫేక్ నంబర్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్లను గుర్తించి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ జూమ్ మీటింగ్లో డిఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సిఐలు శ్రీనివాస్, రాజు, శివశంకర్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular