Tuesday, July 1, 2025

జిల్లా నూతన కలెక్టర్ ను కలిసిన బీఎస్పి నాయకులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బీ.ఎం. సంతోష్ ని శుక్రవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్లో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి కేశవరావు, జోగులాంబ గద్వాల జిల్లా ఉపాధ్యక్షులు జి. మణికుమార్, గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి, బీఎస్పీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి ఆతికూరు రహెమాన్ కలెక్టర్ కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ని కలిసిన వారిలో బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మధు గౌడ్, అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తిరుపాల్, గద్వాల నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, గద్వాల నియోజకవర్గ కార్యదర్శులు చింతరేవుల ముని, సవారన్న, గద్వాల మండల అధ్యక్షులు వెంకట్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, బైరంపల్లి నాగరాజునాయుడు, హనోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular