Monday, June 30, 2025

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బీఎం. సంతోష్-శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్ గా బీఎం. సంతోష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నూతన కలెక్టర్ కి జిల్లా అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపూర్వ్ చౌహన్ లు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సమీకృత భవనంలోని కలెక్టర్ చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేటు సిబ్బంది కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన వల్లూరు క్రాంతి సంగారెడ్డికి బదిలీ కాగా, ఆమె స్థానంలో టీఎస్పీఎస్సిలో అదనపు సెక్రటరీగా పని చేస్తున్న (2017బ్యాచ్) బీఎం. సంతోష్ గద్వాల జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular