Sunday, December 22, 2024

క్రిస్మస్ సెలబ్రేషన్స్​కు..ముస్తాబైన మెదక్ చర్చ్​-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ మెదక్ :యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న వ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ చర్చ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్​కు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్థానిక పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేశారు. చర్చ్ ప్రాకారాలకు రంగులు వేశారు. ఎత్తైన చర్చ్ టవర్, లోపలి మెయిన్ హాల్​ను స్టార్స్, బెలూన్లు, గంటలు, గ్రీటింగ్ కార్డులు, మెరుపు కాగితాలతో కలర్ ఫుల్​గా డెకరేట్ చేశారు. అలాగే యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, ఎత్తైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు.

మెదక్ చర్చిలో ఎంతో గ్రాండ్​గా జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్​ను చూసేందుకు చర్చ్ ఆప్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివస్తారు. ఈ మేరకు పాస్టరేట్ కమిటీతో పాటు, మున్సిపల్, పోలీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి, టాయిలెట్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువ జామున 4:30 గంటలకే ఫస్ట్ సర్వీస్​తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు భక్తులకు దేవుడి వ్యాక్యాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత ఉదయం 9:30 గంటలకు సెకండ్ సర్వీస్ అయ్యాక భక్తులందరిని చర్చి లోపలికి అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం వివిధ రూట్ల నుంచి అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular