ఓరుగల్లు9నేషనల్ టీవీ :బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.61 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం వాటర్ సప్లైలో చాలా లోపాలున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి చెప్పారు. ఈ స్కీమ్‌లో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాను చెప్తున్నానని అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, మందమర్రి, కోటపల్లి మండలాల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో గ్రామాలకు తాగునీటి సప్లై జరుగుతున్నదంటూ.. మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన రివ్యూలో అధికారులు రిపోర్టు ఇచ్చారు. కానీ వాస్తవంగా నీళ్లు రావడంలేదు.
ఈ రోజు నా పర్యటనలో పలు గ్రామాల్లో ప్రజలు నీటి సమస్య, లీకేజీలు, పైపులు బిగించకపోవడం వంటి ఫిర్యాదులు చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని పదే పదే చెప్పింది. కానీ ఎక్కడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు” అని చెప్పారు. నియోజకవర్గంలో నెల రోజుల్లో ఇంటింటికీ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.61 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం వాటర్ సప్లైలో చాలా లోపాలున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి చెప్పారు. ఈ స్కీమ్‌లో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాను చెప్తున్నానని అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, మందమర్రి, కోటపల్లి మండలాల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో గ్రామాలకు తాగునీటి సప్లై జరుగుతున్నదంటూ.. మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన రివ్యూలో అధికారులు రిపోర్టు ఇచ్చారు. కానీ వాస్తవంగా నీళ్లు రావడంలేదు. ఈ రోజు నా పర్యటనలో పలు గ్రామాల్లో ప్రజలు నీటి సమస్య, లీకేజీలు, పైపులు బిగించకపోవడం వంటి ఫిర్యాదులు చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని పదే పదే చెప్పింది. కానీ ఎక్కడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు” అని చెప్పారు. నియోజకవర్గంలో నెల రోజుల్లో ఇంటింటికీ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.