ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలుగు బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 నేటితో ముగియనుంది. గ్రాండ్ ఫినాలే కోసం గ్రాండ్ సెట్ కూడా సిద్దమయ్యింది. స్టార్ గెస్టులు, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇలా చాలా హంగామానే ఉండనుంది ఇవాళ. దీనికి సంబందించిన ప్రోమో కూడా ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. చాలా ఉత్కంఠగా సాగనుందని, మధ్య మద్యలో ట్విస్టులు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.ఇలా ఎన్ని ట్విస్టులు ఉన్న చివరికి విన్నర్ ఎవరు అనేదాని కోసమే ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అర్జున్ ఉన్నారు. బిగ్ బాస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం విన్నర్ ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అంతకన్నా ముందు.. ఆడియన్స్ కు అదిరిపోయే షాకిచ్చాడు యావర్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు మనీ ఆఫర్ చేయగా.. ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల క్యాష్ అందుకుని బయటికి వచ్చేశాడు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇక విన్నర్ విషయానికి వస్తే.. టాప్ 3లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ నిలువగా.. శివాజీ అవుట్ అయ్యారు. అలా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. ఈ ఇద్దరి మధ్య చాలా సేపు సన్స్పెన్స్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ చేయిని పైకి లేపి విన్నర్ గా ప్రకటించారట. దీంతో రైతు బిడ్డ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. రన్నర్ గా అమర్ దీప్ నిలిచాడు. ఒక సాధారణ రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. తన అద్భుతమైన ఆట తీరుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.