Monday, June 30, 2025

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదం-ఎమ్మార్పీఎస్ మాజీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బీఆర్. ఇమ్మానియేల్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మార్పీఎస్ మాజీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బీఆర్. ఇమ్మానియేల్ అన్నారు. కేటీఆర్ ఆరోపణలు చేసే ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏ పార్టీ మేనిఫెస్టోను చూసి కాపీ కొట్టారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని అంటే మీరు రూ.15లక్షల వరకు చేస్తామన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే గ్యాస్ సిలిండర్ ని రూ. 500 రూపాయలకే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అంటే మీరు రూ. 400లకే ఇస్తామన్నది నిజం కాదా? ఇక కాంగ్రెస్ పెన్షన్లను రూ. 4వేలు ప్రకటిస్తే మీరు రూ. 5వేలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని, రైతుబంధు రూ. 15వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటే మీరు రూ. 16వేలు ఇస్తామని, మహిళలకు కాంగ్రెస్ పార్టీ రూ. 2500లు నెలకు అందిస్తామంటే మీరు రూ. 3వేలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీరు చెప్పే మాటలు శ్రీరంగ నీతులు కాంగ్రెస్ పార్టీ చెప్తే అబద్ధపు హామీలు అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మీరు ప్రతి దాన్ని పెంచి ఇస్తామంటేనేమో సాధ్యమైతది, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయడం కోసం పథకాలు ప్రకటిస్తే అవి సాధ్యం కావు అని అహంకారమైన మాట్లాడడం ఒక్క కేటీఆర్ కే చెల్లుతుందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మీకు అందిస్తే ఒక సంవత్సర కాలం వరకు ఏమీ చేయలేని అసమర్థులాగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మాది ఇంకా పసి గుడ్డు ప్రభుత్వం అని బూటకపు మాటలు చెప్పి తప్పించుకున్న విషయాలు మీరు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని మీరు చేసిన కుట్రలను తిప్పి కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి యావత్ తెలంగాణ సమాజమంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతులకు రుణ మాఫీ చేసే విషయంలో కొన్ని రోజులు అటు ఇటు అయినా చేసి తీరుతుందని, మీ ప్రభుత్వం మాదిరి ఐదు సంవత్సరాలకు మళ్లీ అది ఎన్నికలు వస్తున్నాయని డ్రామాలు చేసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular