జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వరాహ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా అంతరాష్ట్ర న్యూ కేటగిరీ విభాగంలో వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు హాజరై ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు సంకాపురం రాముడు మొదటి బహుమతిగా రూ. 40వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు రాముడిని శాలూవా, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, రాముడన్న సైన్యం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలో అంతరాష్ట్ర వృషభాల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం-హాజరైన అయిజ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES