హన్మకొండ ప్రతినిధి:నేడు ప్రపంచ ఎయిడ్స్ దినము సంధర్భంగా జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హనుమకొండ వారి అధ్వర్యంలో జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం లోని సమావేశ మందిరం లో డాక్టర్. టి.మదన్ మోహన్ రావు, అదనపు జిల్లా వైద్య అధికారి (లేప్రాసి మరియు ఎయిడ్స్ ) అధ్యక్ష తన లో డాక్టర్.బి. సాంబశివ రావు, డిఎంహెచ్‌ఓ ముఖ్య అతిధి గా పాలుగొనడం జరిగినది.ముఖ్య అతిధి డాక్టర్.బి. సాంబశివ రావు, డిఎంహెచ్‌ఓ గారు మాట్లాడుతూ హెచ్‌ఐవి నియంత్రణ లో అన్ని ప్రభుత్వ విభాగాల తో పాటు స్వచ్చంద సంస్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు.
వ్యాధి గ్రస్తులకు కావలిసిన వ్యెద్యపరమైన సదుపాయాలను అందిస్తామని వారి ఇతర సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృస్టికి తీసికెలుతామన్నారు. హెచ్‌ఐవిు నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుందని అవి అసురక్షిత లైంగిక సంభంధల ద్వారా, కలుషితమైన సూధులు, సీరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా మరియు హెచ్‌ఐవి్ సోకిన తల్లి నుండి పుట్ట బోయే బిడ్డకు హెచ్‌ఐవి సోకుతుందని కావున ప్రతి గర్భిణి స్త్రీకి సాదారణ పరీక్షలతో పాటు హెచ్‌ఐవి ఎయిడ్స్ టెస్ట్ తప్పనిసరి చేయించాలని, లైంగిక వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రతి గురువారం అడల్ట్ ఫ్రీoడ్లీ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్లినిక్స్ మరియు కౌమార దశలో గల బాల, బాలికలకీ ఔట్ రీచ్ క్యాంప్స్ నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లోభాగంగా ముందుగా డాక్టర్. మదన్ మోహన్ రావు, అదనపు జిల్లా వైద్య అధికారి (లేప్రాసి మరియు ఎయిడ్స్ ) గారు స్వాగత ఉపన్యాసం చేస్తూ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వార్షిక నివేధికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. 2022-23 సంవచ్చరములో 20,522 హెచ్‌ఐవిం పరీక్షలు నిర్వహించగ 55 మందికి హెచ్‌ఐవి వుందని నిర్ధారణ జరిగిందని 21,140 మందిగర్భిణి స్త్రీలకు పరీక్షలు చేయగా 13 మందికి వ్యాది నిర్ధారణ జరిగిందని తెలిపారు. సోషల్ మీడియా అవగాహన లొ భాగం గా facebook, twitter, Youtube లలొ తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సైట్ ని, 1097 HIV tollfree నెంబర్ కి సంభందన్చి అవగాహన కలిపించడం జరుగుతున్నది అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ యాకూబ్ పాషా మాట్లాడుతూ సమాజం లో ఎయిడ్స్ పైన ఉన్న అపోహలని తొలగిస్తూ అవగాహన ని పెంచుతూ, ఎలాంటి అసమానతలు లేకుండా ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయాలని ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా రూపు మాపాలని, రోగిని కాదు రోగాన్ని దూరం చేయాలని తెలియ చేశారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ యాకూబ్ పాషా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్.ఉమాశ్రీ డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ హిమబిందు రవీందర్, కరుణమైత్రి సొసైటి, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, పరిపాలనాధికారి శ్రీమతి చంద్రకళ,డాప్కో మేనేజర్ స్వప్న మాధురి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, హెచ్‌ఈఈఓ చంద్రశేఖర్, హెచ్‌ఈఓ సందెలశ్రీనివాస్, డిప్యూటీ డెమో ప్రసాద్, డాప్కో సిబ్బంది రమేశ్, కమలాకర్, కరుణమైత్రి పాజిటివ్ నెట్వర్క్, రుద్రమదేవి మహిళా మండలి, MARI, word truckers, word migraints, linkworkers team, VRG care స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వారి సిబ్బంది, ఐసిdటిసి కౌనిసిలర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శిక్షణ విద్యార్థినిలు, లేప్రాసి సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.