జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో 27న ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత కోరారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మేళ్లచెర్వు చౌరస్తాలో సోమవారం ఉదయం 11గంటలకు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గంలోని పల్లె, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈనెల 27న ప్రియాంక గాంధీ సభను జయప్రదం చేద్దాం-గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES