జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి అయిన బోయ శివారెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. ధరూర్ మండల కేంద్రంలో బిజెపి గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోయ శివారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన సకలజనుల ఆశీర్వాద సభకు డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈసారి బీసీ వ్యక్తులకు అవకాశం కల్పించిందని ఈ మేరకు గద్వాల్ నియోజకవర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డిని పోటీలో నిలబెట్టి మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. గద్వాల్ ప్రాంతంలోని బోయ వాల్మీకులకు, బహుజనులకు ఇది ఒక సువర్ణ అవకాశమని ప్రతి ఒక్కరూ శివారెడ్డి గెలుపుకు సహకరించి గద్వాల్ నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అయినా బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆమె ప్రజలను కోరారు.
విజయవంతమైన సకలజనుల ఆశీర్వాద సభ-హాజరైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES