Sunday, June 29, 2025

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి౼కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీరాములు-వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది౼బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా  తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకులకు కేంద్ర బీజేపీ అవకాశం ఇచ్చిందని, ఇచ్చిన అవకాశాన్ని వాల్మీకులందరు సద్వినియోగం చేసుకొని బీసిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీరాములు అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో వాల్మీకుల మహా గర్జన సభ ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీరాములు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ ఈ సారి గద్వాలలో వాల్మీకులకు అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాల్మీకి బిడ్డను గెలిపించుకొని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మీతో పాటు తాను కూడా ఉంటానన్నారు. కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్నందుకు 15మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారని వివరించారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక్కసారి, ఎంపీగా గెలిచానని తెలిపారు. వెనుకబడిన జాతులంతా ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని ఆయన ప్రజలకు వివరించారు. అడవులలో ఉండి సంచారం చేసే వాల్మీకులను డీకే అరుణ పెద్ద మనసుతో తన స్థానం త్యాగం చేసి అవకాశం కల్పించాలని దానిని సద్వినియోగం చేసుకుని బోయ శివారెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. తెలంగాణలో ఏ పార్టీ వాల్మీకులకు అవకాశం ఇవ్వలేదని ఒక్క బీజేపీ పార్టీయే గద్వాలలో వాల్మీకులకు అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేశారు. 70వేల ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బోయ శివారెడ్డిని గెలిపించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదన పెడదామని అందుకు డీకే అరుణతోపాటు తాను కూడా పోరాడుతానని తెలిపారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అని, వేల కోట్లు సంపాదించుకొని ప్రజల అభివృద్ధిని మర్చిపోయారని అన్నారు. *డీకే అరుణ మాట్లాడుతూ* ఈ సారి ఎన్నికల్లో రెడ్డిని కాకుండా బీసీని గెలిపించాలని అన్నారు. డికె.అరుణ ఎక్కడికి వెళ్లినా గద్వాల ప్రజల అభివృద్ధి గురించే ఆలోచిస్తుందని తెలిపారు. కొందరు ఈ సారి అల్లుడిని గెలిపించడానికి శివారెడ్డిని పోటీలో నిలపెట్టిందని చెప్తున్న సన్యాసుల మూతి పగుల గొట్టాలని అన్నారు. డబ్బులకు అమ్ముడుపోయి, వెన్నుపోటు పొడిచి చేతకాని సన్నాసులు నేడు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అధికార పార్టీలో జడ్పీ చైర్మన్ గా ఉన్న నాయకురాలు పేద ప్రజల పట్టాలు గుంజుకున్నప్పుడు, రోడ్డు మీద ధర్నాలు చేసినప్పుడు ఒక్కసారి కూడా పలకరించిన పాపానపోలేదని అన్నారు. 2014లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని, గట్టు భీముడుకి ఎమ్మెల్సీ ఇస్తానని హమీ ఇచ్చిన కేసీఆర్ మోసం చేశాడని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అర్హులుగా ఉన్న ఇద్దరికీ పింఛన్ ఇస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు10 పైసల వడ్డీ రుణాలు ఇస్తుందని, ఉజ్వల పథకం కింద సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు. పేద ప్రజల కలలు సాకారం కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, ఇక్కడ బీసీ వాల్మీకి బోయ శివారెడ్డిని గెలిపించుకొని గద్వాల ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గద్వాల ప్రజలందరూ బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల  అభ్యర్థులు శివారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి, బీజేపీ నాయకులు రామాంజనేయులు, వాల్మీకి సంఘం నాయకులు వైండింగ్ రాములు, వీరబాబు, మహిళా నాయకురాలు కృష్ణవేణి, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular