Sunday, June 29, 2025

కాంగ్రేస్ పార్టీకి 90 నుంచి100సీట్లు వస్తాయి-మాజీ ఎంపీ మల్లు రవి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మల్లు రవి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీకి 90 నుంచి 100సీట్లు రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన పోయి మంచిపాలన వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకొని రేవంత్ రెడ్డి వస్తే ఇబ్బందిగా మారుతుందని ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డిపై మాట్లాడటం కాంగ్రేస్ గెలుపునకు నాంది అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని, కాంగ్రేస్ పార్టీలోకి దూకి ప్రాణాలు రక్షించుకొనే పనిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పడ్డారని జ్యోషం చెప్పారు. బిఆర్ఎస్ పార్టీకి పోలీసు యంత్రాంగం ప్రవేటు సైన్యంగా పనిచేస్తుందని ఆయన పోలీసు శాఖను విమర్శించారు. ఆనాటి రజాకార్ల వ్యవస్థను గుర్తుచేసే విధంగా బిఆర్ఎస్ పాలన ఉందన్నారు. బ్రిటిష్ పరిపాలన పోవడానికి మనవాళ్ళు ఎన్ని పోరాటాలు చేసారో అదే ధోరణిలో నేడు తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీని తప్పించడానికి కాంగ్రేస్ పార్టీ కృషి చేస్తుందని, దీనికి అన్ని వర్గాలు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా కాంగ్రేస్ ప్రభుత్వం వైపు ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నరకాసుర వదా అవుతుందని ఆ రోజే గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత సమక్షంలో భారీగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రేస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఎంఎసి మైక్రో బయోలజీ చదువుకున్న వ్యక్తి కావడం వల్ల చిన్న వస్తువులను కూడా పరిశోధన చేసే పరిజ్ఞానం కల్గిన చదువు చదివిన వ్యక్తి మీ నియోజకవర్గం అభ్యర్థి కావడంతో మీ నియోజకవర్గంలో చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయడంలో సామర్ధ్యం కల్గిన నాయకురాలని కోరారు. కాంగ్రేస్ పార్టీ హయాంలో ఇరిగేషన్ అభివృద్ధి జరిగిందని నాగార్జున్ సాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టంపాడు, ర్యాలంపాడు, ద్యాగదొడ్డి, నాగర్ దొడ్డి, తాటికుంట, తూముకుంట రిజర్వాయర్ ప్రాజెక్టులన్ని కూడా కాంగ్రేస్ ప్రభుత్వమే చేపట్టిందన్నారు. 26వ తేదిన ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభను గద్వాలలో విజయవంతం చేయాలని మల్లు రవి కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular