జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, గట్టు మండలంలోని బల్గెర గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె గట్టు జెడ్పీటిసి బాసు శ్యామల హనుమంతునాయుడు ఇంటికి వెళ్లి అక్కా బహుజన బిడ్డనైన నాకు ఒక్కసారి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మొదటిసారి ఇంటికి వచ్చిన బహుజన ఆడబిడ్డ సరితకు జడ్పీటిసి శ్యామల మర్యాద పూర్వకంగా బొట్టుపెట్టి ఆశీర్వదించారు. సరిత వెంట ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ బాబు, గట్టు సత్యనారాయణ, బండారి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు
అక్కా బహుజన బిడ్డకు ఓటు వేసి ఆశీర్వదించండి-కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES