జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎన్నికల పోలీసు పరిశీలకులు (అబ్జర్వర్)ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసిన పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల పోలీస్ పరిశీలకులు అనుపం శర్మని ఉదయం ఎర్రవల్లి బెటాలియన్ అతిథి గృహం నందు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, జిల్లా భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, భద్రత పరంగా తీసుకుంటున్న అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు జిల్లా నందు పట్టుబడిన అక్రమ సరుకు, డబ్బు, మద్యం, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల వినియోగింపు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై వారు చర్చించారు.
ఎన్నికల పరిశీలకున్ని కలిసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES