జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం డికె బంగ్లాలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని మాజీ మంత్రి అరుణ అన్నారు. ధరూరు మండలం ఉప్పేరు, మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు భారీ ఎత్తున సుమారు 300 పంది బిజెపి పార్టీలో చేరారు. మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ వారికి కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీకే. అరుణ మాట్లాడుతూ. ఈ ప్రాంతంలో వాల్మీకి నాయకుని గెలిపించుకుని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
భూకబ్జాలతో అక్రమ సంపాదన సంపాదించి గద్వాల ప్రజలను మోసం చేసి గద్వాల ప్రాంతాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఏ ఒక్క రోడ్డుకు గంపెడు మట్టి వేయలేదని విమర్శించారు. గద్వాల ప్రాంతం అభివృద్ధి కోసం చెమట చుక్క కార్చని నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. జడ్పీ చైర్మన్ గా ఉండి గద్వాలకి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ అందరూ కలిసి మన గద్వాల ప్రాంతానికి చెందిన వాల్మీకి బోయ శివారెడ్డి ని గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థి బలిగేరా శివారెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, రాజేష్ అయ్య,అంజి రెడ్డి,ఆదిమల్లారెడ్డి, పాల్వాయి రాముడు,తదితరులు ఉన్నారు
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది : డీకే.అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES