జోగులాంబ గద్వాల జిల్లా
ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతికూరు రహిమాన్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కి ఎన్నికల నిబంధనలు అనుసరించి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం అతికూరు రహిమాన్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సిద్ధాంతాలను అనుసరిస్తూ గద్వాలలో బిఎస్పీ నీలి జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఆయన వెంట బీఎస్పీ గద్వాల నియోజకవర్గ నాయకులు చింతరేవుల ముని, తదితరులు పాల్గొన్నారు.
గద్వాల నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అతికూరు రహిమాన్…ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES