జోగులాంబ గద్వాల జిల్లా
ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించే ఎన్నికల పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు తొలి ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నందు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ ప్రక్రియ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బందిని కేటాయింపు చేసి కంప్యూటర్లో చూయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో జరిగే అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ నెం1950, సి-విజిల్ యాప్ ద్వారా తెలుపుటకు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, ఇది 24గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను రికార్డు చేసి రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, సిపిఓ లక్ష్మణ్, ఇడిఏం శివకుమార్ తదితరులు ఉన్నారు.
ఎన్నికల అధికారులకు విధులు కేటాయింపు పూర్తి-వివరాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి… ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES