జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయుడు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయుడు అలంపూర్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల నిబంధనలు అనుసరించి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు సమర్పించారు. ఈ సందర్భంగా విజయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, తనను వెన్నంటి నడిపిస్తున్న చల్లా వెంకట్రామిరెడ్డి సహకారాన్ని ఎన్నడు మరువనని, ఆయన అండతో నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అలంపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయుడు నామినేషన్ దాఖలు-హాజరైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి… ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES