జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.సమాజంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు, వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే రాజకీయ ప్రక్షాళన ఒక్కటే మార్గమని మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ అన్నారు.ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. సమాజానికి ఏదైనా మంచి చేద్దామని భావిస్తే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని, అవి ఎక్కడ రాజకీయ వ్యవస్థ నుంచే కావడం సిగ్గుపడాల్సిన అంశమన్నారు. రాజకీయ నాయకులు కూడా మొదట ప్రజలకు మంచి చేద్దామని వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక వారి ఆస్తులు పెంచుకోవడానికి, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్పా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించడం లేదన్నారు. నేడు ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదని, నాణ్యమైన విద్య, వైద్యం, జీవనోపాధి కల్పించాలని అన్నారు. వీటిపై ప్రజలందరు ఏకతాటిపై నిలిచి నేటి రాజకీయ నాయకులను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులకు ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే వారి లక్ష్యం అని, ప్రజా సంక్షేమం కాదన్నారు. ఎన్నికల్లో కులం, మతం, మద్యం, డబ్బు ప్రాతిపదికన కాకుండా ఏ పార్టీ అభ్యర్థి అయినా ఆ అభ్యర్థి నిజాయితీ, మంచితనం ఆధారంగా ఏ పార్టీ అయిన, ఏ నాయకుడికైనా ఓటు వేయాలని సూచించారు. ప్రజలకు కావాల్సింది బిక్ష కాదు, ఉపాధి, ఉన్నత విద్య, ఆరోగ్యం, అవినీతి రహిత పాలన కావాలని, దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, తోటి వారిని చైతన్య పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎం. చౌదరి, అయిజ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థ మార్పుకు రాజకీయ ప్రక్షాళన చాలా అవసరం-మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ సింగ్ …. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES