జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టివి
రేపు గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటన సంధర్బంగా పక్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రితి రాజ్ తెలిపారు.
ముఖ్య మంత్రి గారి పర్యటనకు సంబంధించి పోలీస్ ఫోర్స్ కు గద్వాల్ పట్టణం లోని పరివార్ ఫంక్షన్ హల్ నందు జిల్లా ఎస్పీ బందో బస్తుకు సంభందించి సూచనలు ఇవ్వడం జరిగింది. సిబ్బంది అందరు ఇంఛార్జి అధికారుల సూచనలతో SOPని అనుసరించి విధులు నిర్వహించాలని అన్నారు.
సెక్టార్ ల వారీగా ఇంఛార్జి లు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ ఎస్పీ తగు సూచనలు చేశారు.
అనంతరంసభ స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. మీడియా గాలరీ,VIP గాలరీ, పబ్లిక్ గాలరీ ప్రదేశాలను, స్టేజి ప్రాంగణాన్ని పరిశీలించి పోలీస్ అధికారులకు,సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆనంతరం హెలిప్యాడ్ ప్రదేశాన్ని, VIP వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని, మేళ్ల చెరువు రోడ్డు వైపు ఉన్న పబ్లిక్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
విదులలో ఉండే పోలీస్ అధికారులు ఎస్పీ -1, అదనపు ఎస్పీ లు -2
డి. ఎస్పీ లు -6
సి. ఐ లు -14
ఎస్సై లు -42
ఇతరులు 240 బందోబస్తులో పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు.