జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ గద్వాల జిల్లా బిజెపి పార్టీ మారుతున్నట్లు కొన్ని వార్త పత్రికలు, మీడియా చానళ్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. బిజెపి నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రసార మాధ్యమాలకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం వస్తుంది అని అన్నారు. తన నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్న విషయం కొన్ని పత్రికలు, ఛానళ్లకు కనిపించడం లేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు ఊపిరి ఉన్నంత వరకు బిజెపి లోనే కొనసాగుతానని, ఈ విషయం పై మరోసారి మీడియా తమ ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్దంగా ఉండాలని డీకే అరుణ హెచ్చరించారు.