Tuesday, December 24, 2024

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9 నేషనల్ టీవీ : ప్రధానమంత్రి మోదీ సభను విజయవంతం చేయాలి.బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ

జోగులాంబగద్వాలజిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ జిల్లా కేంద్రంలో డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ మాట్లాడుతూ హైదరాబాద్ లో నెల 7వ తేదీన జరగనున్న బిసి ల సభకు ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారని కావున నాయకులు,కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేరుతాయని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి మరోసారి అబద్ధపు హామీలతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తప్పుడు హామీలతో మరోసారి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని అన్నారు.ఓట్ల కోసం ప్రజలను ముంచాలని అబద్ధాపు హామీలు చెబుతున్నారని ఇవి తెలంగాణ ప్రజలు గ్రహించాలని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ప్రపంచ దేశాల అభివృద్ధి 2014లో పదకొండవ స్థానంలోఉన్నదానిని కరోనను ఎదుర్కొని ఆర్థిక స్థితిగతులను అధిగమించి ఐదవ స్థానంలో నిలబెట్టారని అన్నారు.
అవినీతి హామీలతో మోసం చేసిన BRS పార్టీ ప్రజలు మేల్కోవాలని కాళేశ్వరం బ్రిడ్జ్ ఎప్పుడు కులుతుందో తెలియదని,ప్రాజెక్టు లు నిలబడటం లేదని దేశం లో అవినీతి రాష్ట్రం గా మొదటి స్థానం లో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు.
BRS పార్టీ తోలు తినే పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఎముకలు కూడా మిగలునియ్యదని తెలంగాణ ప్రజలు మేలుకోవాలని అన్నారు.
గద్వాల ప్రజల కోసం గద్వాల నుండి హైదరాబాద్ దాక పాదయాత్ర చేసి నెట్టెంపాడు సాధించానని అనుక్షణం ప్రజల కోసం పనిచేశానని అరుణమ్మ ను విమర్శించే సాయి మీది కాదని అన్నారు.
ల్యాండ్,సాండ్ మాఫియా,లిక్కర్ మాఫియా భూకబ్జాలు,పోవాలంటే బిజెపి పార్టీని గెలిపించాలని అన్నారు.11వ తేదీన ఎస్సీల సభను ఏర్పాటు చేస్తున్నారని ఈసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని కావున పెద్ద ఎత్తునఈ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో గద్వాల బిజెపి అసెంబ్లీ అభ్యర్థి బలిగేర శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, మండల అధ్యక్షులు పాల్వాయి రాముడు ,అనిమిరెడ్డి, రాజేష్ అయ్య, కౌన్సిలర్ శ్రీరాములు,గుర్రం నరసింహులు,రజక జయశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు పులిపాటి వెంకటేష్,అంజిరెడ్డి,గీత రెడ్డి,తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular