మహబూబ్ నగర్ ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 2, 43,331 మంది, జడ్చర్లలో 2,12,384 మంది, దేవరకద్రలో 2,28,077 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.80 ఏండ్లు దాటిన వారు,40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న వారికి హోమ్ ఓటర్స్ గా గుర్తించి వారు కోరితే ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లాలో 12,931 మంది దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారు 6,821 మంది ఉన్నారని చెప్పారు. జిల్లాలోని 864 పోలింగ్ స్టేషన్లలో సౌలతులు కల్పించామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక పోలీస్ ఆఫీసర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించామని, ఎలక్షన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. జడ్చర్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్. మోహన్ రావు, యు. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు-ఓరుగల్లు9నేషనల్ టివి
RELATED ARTICLES