ఓరుగల్లు 9నేషనల్ టీవీ :నేను తప్పు చేయను.. ఎవరికీ తలవంపులు తీసుకురాను’ అని ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ క్యాండిడేట్ కడియం శ్రీహరి చెప్పారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం, తాటికాయల, కరుణాపురం గ్రామాల్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు పైసలు ఇవ్వడమే కాని, ఎవరి జేబులోంచి తీసుకోవడం తెల్వదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.ప్రజలను మోసం చేసేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల డ్రామా ఆడుతోందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లో గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తానని హమీ ఇచ్చారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలోని పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, డీసీసీబీ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మునిగెల రాజు, సర్పంచ్‌లు రాజమణి, పెసరు రమేశ్ పాల్గొన్నారు.
ఆరు గ్యారంటిల కాంగ్రెస్ డ్రామా-కడియం శ్రీహరి-ఓరుగల్లు 9నేషనల్ టీవీ
RELATED ARTICLES