ఓరుగల్లు9నేషనల్ టీవీ హన్మకొండ ప్రతినిధి :-తెలంగాణ పూల పండుగ బతుకమ్మను యూనివర్సిటీ మహిళా కళాశాల సుబేదారి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు విచ్చేసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడి ఆకట్టుకునే నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ ఉపకులపతి, కాకతీయ యూనివర్సిటీ, తాటికొండ రమేష్ గారి సతీమణి శ్రీమతి తాటికొండ భావన గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పూలను దేవతగా పూజించడం అనేది తెలంగాణ ప్రత్యేకత అని ఇది ప్రకృతిని ఆరాధించడంమే అని మరియు ఆడపడుచులు పాడే పాటల ద్వారా తెలంగాణ సంస్కృతిని తర్వాతి తరాలకు అందజేస్తారని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతకమ్మ పాటలు పాడి ఆడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బిఎస్ఎల్ సౌజన్య జి. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే. కవిత, కళాశాల అధ్యాపకులు డాక్టర్ కే. భాగ్యలక్ష్మి, డాక్టర్ జి. కవిత, డాక్టర్ సుజాత, డాక్టర్, డాక్టర్ లలిత కుమారి డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ రవీందర్, డాక్టర్ కుమారస్వామి, పోదనేతర సిబ్బంది మరియు కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు

