ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి వరంగల్:రేపు (అక్టోబర్ 3న) కాకతీయ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నిరసన చేసిన స్టూడెంట్లను అరెస్ట్ కు నిరసన గా బంద్ కు పిలుపునిచ్చాయి. పీహెచ్ డీ అక్రమాల విషయంలో సత్యమే జయించాలనే ఉద్దేశంతో పోరుబాట పట్టారు విద్యార్థి సంఘం నేతలు. పీహెచ్ డీలో అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు KU JAC నేతలు.
కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటూ కొద్ది రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీసీ తాటికొండ రమేశ్ అక్రమాలకు నిరసనగా గాంధీ జయంతి రోజున తామంతా సామూహికంగా ఆత్మార్పణ చేసుకుంటామని, ఇందుకోసం పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ శనివారం (సెప్టెంబర్ 30న) వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట స్టూడెంట్లు ఆందోళనకు దిగారు.