ఓరుగల్లు9నేషనల్ టీవీ :అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావానికి బీజేపీ సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సభకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ఆదివారం వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
దేశ ప్రధానిగా మోదీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలోనూ ఆయన మహబూబ్నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పాలమూరులో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, పాలమూరు, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలోని నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపేందుకు మోదీ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్3న నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్శుక్రవారం సమీక్షించారు. రామగుండం ఎన్‌టీపీసీ 800 మెగావాట్ల ప్రాజెక్టును వర్చువల్‌గా పీఎం ప్రారంభించనున్నారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ఆదేశించారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్ కలెక్టర్, సీపీ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.